లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు: జగదీశ్ రెడ్డి

by Shyam |
లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు: జగదీశ్ రెడ్డి
X

దిశ, నల్గొండ: కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిన నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఒక్కరోజే 16 కొత్త కేసులు నమోదు కావడంతో.. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఇతర అధికారులతో కలిసి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తూ నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజల వద్దకే నిత్యావసర సరుకులను చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను కలిసినవారు ఇంకా ఎవరైనా ఉంటే క్వారంటైన్‌కు తరలించాలని చెప్పారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండి.. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Tags: minister jagadish reddy, emergency meeting, corona, suryapet

Advertisement

Next Story

Most Viewed