- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘పోలీసు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది సేవలకు సలాం’
దిశ, నల్లగొండ:
వైద్య ఆరోగ్యశాఖ, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి చేస్తున్న సేవలకు సలాం అని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అదే సమయంలో వైద్య ఆరోగ్యశాఖ, పురపాలక శాఖతోపాటు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తూ సమన్వయం చేస్తున్న పాలనా యంత్రాంగాన్ని కూడా ఆయన అభినందించారు. మంగళవారం ఉదయం సూర్యాపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పోలీసులకు వాటర్ బాటిళ్లతోపాటు, జ్యూస్ బాటిళ్లను కూడా అందజేశారు. వైద్య ఆరోగ్య, పురపాలక, పొలీసు శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బత్తాయిలు, నిమ్మకాయలు అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సూర్యాపేటకు చెందిన మాజీ కౌన్సిలర్ వైఎల్ఎన్ గౌడ్ పోలీసు సిబ్బందికి వాటర్, ఆరెంజ్ జ్యుస్ బాటిళ్లు అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, డీఎస్పీ నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Tags: minister Jagadish Reddy, congratulate, medical staff, police, sanitation workers, corona virus, nalgonda