- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్ సిరీస్ నుంచి జడేజా ఔట్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటన అనంతరం టీమ్ ఇండియా స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ సిరీస్ ఆడనున్నది. ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేలలో ఇంగ్లాండ్, ఇండియా తలపడనున్నాయి. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన రవీంద్ర జడేజాను టెస్టులకు ఎంపిక చేయలేదు. మూడో టెస్టులో గాయపడిన రవీంద్ర జడేజాకు ఆస్ట్రేలియాలో శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆయన బొటనవేలి గాయం తగ్గడానికి కనీసం 6 వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో టెస్టుల తర్వాత టీ20ల వరకైనా కోలుకుంటాడని బీసీసీఐ భావించింది. కాగా, రవీంద్ర జడేజా గాయం తగ్గడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తున్నది. దీంతో అతను మొత్తం ఇంగ్లాండ్ సిరీస్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. జడేజాను బెంగళూరులోని ఎన్‌సీఏకు రీహాబిలిటేషన్ కోసం పంపించాలని బోర్డు నిర్ణయించింది. గతంలో ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు కూడా ఎన్ఏసీలోనే కోలుకున్నారు.