- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు.. వ్యాక్సిన్ ఫ్రీ ఎవరిస్తున్నరు..?
దిశ, జడ్చర్ల : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేసి దేశవ్యాప్తంగా ఉచిత కొవిడ్-19 వ్యాక్సినేషన్‌ను ప్రజలందరికీ అందిస్తుంది. అలాంటిది ప్రధాని మోడీ ఫోటోను రాష్ట్ర ప్రభుత్వాలు బ్యానర్లలో ముద్రించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉన్న బ్యానర్లను ఏర్పాటు చేశారు.
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రధాని ఫోటోను ముద్రించలేదు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌ను బీజేపీ జడ్చర్ల శాఖ ఆధ్వర్యంలో నిలదీసిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించి మోడీ ఫోటో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇకముందు ఇలాంటి తప్పులు జరిగితే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన తప్పదని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సామల నర్సింలు, నగర అధ్యక్షులు మధు, వెంకట్ రామ్ రెడ్డి, వెంకట్, నాగరాజు, అమర్నాథ్ గౌడ్, సూరి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.