- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ‘ఉమన్స్ స్టోరీస్’ టైటిల్‌తో వస్తున్న ఆంథాలజీలో చాన్స్ కొట్టేసింది ఈ భామ. ఆరు సెగ్మెంట్లతో రానున్న ఆంథాలజీకి మహిళా డైరెక్టర్లే దర్శకత్వం వహిస్తుండగా..మహిళలే నటించడం విశేషం. ‘షేరింగ్ ఏ రైడ్’ పేరుతో వస్తున్న సెగ్మెంట్‌కు లీనా యాదవ్ డైరెక్టర్ కాగా, జాక్వెలిన్ ట్రాన్స్‌జెండర్ మోడల్ అంజలి లామాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
నాన్ ప్రోఫిట్ ప్రొడక్షన్ కంపెనీ ‘వి డు ఇట్ టుగెదర్’ నిర్మిస్తున్న ఆంథాలజీని ఇర్వోలినో ఎంటర్టైన్మెంట్ కో ప్రొడ్యూస్ చేస్తోంది. వివిధ రంగాల మహిళలకు చెందిన కథలను దర్శకులు మరియా సోల్ టోగ్నాజ్జి, లూసియా పుయెంజో, కేథరీన్ హార్డ్‌విక్కే తెరపై ఆవిష్కరించబోతుండగా..కారా డెలివింగ్న్, ఎవా లాంగోరియా, మార్గెరిటా బై, మార్సియా గే హార్డెన్, లియోనోర్ వారెలా ఆంథాలజీలో నటిస్తున్నారు.
సినిమాలు, మీడియాలో మహిళల ఇమేజ్‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా ‘వి డు ఇట్ టుగెదర్’ సంస్థ పనిచేస్తుందన్నారు ఫౌండర్, ప్రెసిడెంట్ చియారా తిలెసి. కెమెరా ముందు, కెమెరా వెనుక కూడా మహిళల కథలను చెప్పేందుకు సంస్థను అంకితం చేశామని తెలిపారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా డైరెక్టర్లు, యాక్ట్రెస్‌ను కొలబొరేట్ చేస్తూ ఆంథాలజీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు.