జాన్వీ మూవీకి నెగెటివ్ పబ్లిసిటీ

by Shyam |
జాన్వీ మూవీకి నెగెటివ్ పబ్లిసిటీ
X

అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా ‘ధడఖ్’ మూవీతో వెండితెరకు పరిచయమైన క్యూట్ హీరోయిన్ జాన్వీ క‌పూర్. త్వరలోనే ఆమె ‘గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్’ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. భారతదేశపు మొదటి మహిళా పైలట్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 12న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేయ‌నున్న సంగతి తెలిసిందే.

ఆర్మీ బ్యాక్‌డ్రాప్ నేప‌థ్యంలో తెరకెక్కడంతో ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. కాగా, తాజాగా రిలీజైన ట్రైల‌ర్.. ఆ అంచ‌నాలు మ‌రింతగా పెంచింది. అయితే, ఈ చిత్రానికి క‌ర‌ణ్ జోహార్ నిర్మాత కావ‌డంతో కొందరు పనిగట్టుకుని నెగెటివ్ ప‌బ్లిసిటీ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో యూట్యూబ్‌లో రిలీజైన ట్రైల‌ర్‌కు లైక్స్‌తో సమానంగా డిస్‌లైక్స్ కూడా పెరుగుతున్నాయి. సుశాంత్ సింగ్ మ‌ర‌ణానికి క‌ర‌ణ్ జోహార్ కూడా ఓ కార‌ణ‌మంటూ ఇటీవ‌ల విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న నిర్మించిన సినిమాలకు అడ్డంకులు సృష్టించేందుకు సుశాంత్ అభిమానులు కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లుగా క‌నిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే గుంజ‌న్ స‌క్సేనా చిత్రానికి నెగెటివ్ ప‌బ్లిసిటీ ఎక్కువైంది.

Advertisement

Next Story