- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పన్నుల ఫారంలో కొత్త టేబుల్!
దిశ, సెంట్రల్ డెస్క్: 2020 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారులకు, ప్రభుత్వం జూన్ 30 వరకూ సమయం ఇచ్చింది. ఇంకా, 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీని జూలై 31, 2020 నుంచి నవంబర్ 30, 2020 వరకు పొడిగించారు. ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభించేటప్పుడు, ఫారం 26లో తీసుకువచ్చిన కొత్త మార్పులను పరిగణనలోకి తీసుకున్నట్టు నిర్ధారించుకోవాలి. ఏప్రిల్–జూన్ మధ్య ఆదాయాల గురించి ఇందులో తెలపాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను తగ్గింపునకు దరఖాస్తు చేసుకోవడం వీలవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వివరాలను సమర్పించేందుకు ఆదాయం పన్ను శాఖ పన్నుల ఫారంలో కొత్త టేబుల్‌ను జతచేసింది. ఇందులో ఏప్రిల్, జూన్‌లకు సంబంధించిన పెట్టుబడుల వివరాలు సమర్పించాలి. మామూలుగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌ను జూలై 31లోపు అందజేయవచ్చు. బిలేటెడ్ ఐటీఆర్‌ను సబ్మిట్ చేయడానికి మార్చి 31 వరకు గడువు ఉంటుంది. 2019 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది మార్చిలోపే ఐటీఆర్ అందజేయాలి కానీ ఈ గడువును జూన్ 30వ తేదీ వరకు పెంచడం జరిగింది. ఇది వరకు దాఖలు చేసిన దాంట్లో ఏవైనా తప్పులుంటే, మరోసారి ఐటీఆర్‌ను అందజేసే వీలుంటుంది. అలాగే, ఆధార్‌కార్డుతో పాన్‌కార్డును లింక్ చేయడానికి కూడా జూన్ 30 వరకే గడువు ఉంది. ఈలోపు అవకపోతే తర్వాతి నెల నుంచి పాన్‌కార్డు పని చేయదని క్లియర్ ట్యాక్స్ సీఈవో అర్చిత్ గుప్తా తెలిపారు. ఇకమీఅట అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ నెంబర్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఏదైనా ఆస్తి కొనుగోలు చేసినా, బ్యాంకు, డీమాట్ ఎకౌంట్ క్రియేట్ చేసినా పాన్ నెంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ఆధార్‌తో పాన్‌కార్డ్‌ను అనుసంధానం చేయాలని ఆదాయ పన్ను విభాగం ఇది వరకే తప్పనిసరి చేసింది. ఇప్పటికే చాలా సార్లు గడవు పెంచిన ఐటీ శాఖ.. మరోసారి గడువు పెంచే అవకాశాలు లేకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.