‘శిఖర్ ధావన్ వరల్డ్ కప్ ఆడటం కష్టమే’

by Shyam |
shikhar Dhawan
X

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్‌ రాబోయే టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించడం కష్టమేనని మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డారు. శ్రీలంక పర్యటనలో అతడు బ్యాటుతో ఎంతగా రాణించినా.. ఇతర క్రికెటర్ల వల్ల ఉన్న పోటీ ద్వారా అతను తుది జట్టులో ఉండకపోవచ్చని అన్నాడు. ఇప్పటికే టీ20 క్రికెట్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఉన్నారని.. వారిద్దరి మంచి ఫామ్‌లో ఉండటంతో మూడో ఓపెనర్ బెంచ్‌కు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని అగార్కర్ అన్నాడు. ‘ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఓపెనర్‌గా శిఖర్‌కు రాబోయే వరల్డ్ కప్‌లో చోటు దక్కాలంటే రోహిత్, కేఎల్ రాహుల్‌లో ఒకరిని పక్కన పెట్టాలి. శ్రీలంకలో అతడు భారీగా పరుగులు సాధించినా.. టీమ్ సెలెక్షన్‌లో మాత్రం ముందు ఉండక పోవచ్చు.’ అని అగార్కర్ అన్నాడు.

Advertisement

Next Story