- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అనురాగ్ కశ్యప్, తాప్సీ ఆస్తులపై ఐటీ దాడులు
ముంబయి: బాలీవుడ్ సెలెబ్రిటీలు, దర్శక నిర్మాతల ఆస్తులపై ఐటీ శాఖ అనూహ్య తనిఖీలు చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ఫాంటమ్ ప్రొడక్షన్స్ పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్, నటి తాప్సీ పన్ను, విక్రమాదిత్య మోట్వానే, వికాస్ బాహల్, మధు మంతెనలకు చెందిన ఆస్తులు, కంపెనీలపై దాడులు చేసింది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ సీఈవో శిభాశిశ్ సర్కార్ ఆస్తులపైనా పన్నుల శాఖ దాడి చేసింది. ఫాంటమ్ పన్ను ఎగవేతను దర్యాప్తు చేస్తూ ఆ సంస్థ మాజీ ప్రమోటర్లు అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే, వికాస్ బాహల్, మధు మంతెనల ఆస్తులపై తనిఖీలు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ దాడులు ప్రభుత్వ వ్యతిరేక గళాలను నొక్కివేయడంలో భాగంగానే ప్రభుత్వం నిర్వహించిందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. బీజేపీ ప్రభుత్వం ఇలాంటి దాడులు నిర్వహించడం సర్వసాధారణంగా మారిందని మహారాష్ట్ర మంత్రి అశోక్ చవాన్ అన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై గొంతునెత్తే సెలెబ్రిటీలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. సర్కారు దారిలో నడవనివారిని వేధించడంలో భాగంగానే ఐటీ తనిఖీలు నిర్వహించిందని సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. భారత ఆదాయ పన్నుల శాఖ బానిస సంకెళ్లు తెంచుకుంటుందని ఆశిస్తున్నానంటూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది వ్యంగ్యాస్త్రాలు సంధించారు.