పీఎస్‌ఎల్వీ-సీ49 ప్రయోగం విజయవంతం

by srinivas |   ( Updated:2020-11-07 06:48:34.0  )
పీఎస్‌ఎల్వీ-సీ49 ప్రయోగం విజయవంతం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో లాక్‌డౌన్ తర్వాత మొదటిసారిగా పీఎస్‌ఎల్వీసీ-49 రాకెట్‌ను శనివారం విజయవంతంగా ప్రయోగించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.03గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కాగా.. శనివారం మధ్యాహ్నం 3.12 గంటలకు నింగిలోకి దూసుకెళ్లినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రాకెట్‌తో ఈఓఎస్‌-1 శాటిలైట్‌తో పాటు మ‌రో 9 క‌స్ట‌మ‌ర్ శాటిలైట్లను నింగిలోకి ప్రవేశపెట్టారు. ఇందులో ప్రవేశపెట్టిన తొమ్మిది ఉప‌గ్ర‌హాల్లో అమెరికా, ల‌గ్జంబ‌ర్గ్‌, లుథివేనియా దేశాల‌కు చెందిన ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యలోకి చేర్చారు. పీఎస్‌ఎల్వీ సీ-49 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినట్టు ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed