- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రిమోట్ సెన్సింగ్‌లో ఇస్రో ఫ్రీ కోర్స్
దిశ, వెబ్‌డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కోసం ఫ్రీగా ఆన్‌లైన్ కోర్స్‌ను ఆఫర్ చేస్తోంది. 15 వారాల పాటు అందించే ఈ ‘రిమోట్ సెన్సింగ్, జీఐఎస్, జీఎన్ఎస్ఎస్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్స్’ కోర్సును ఏఐసీటీఈ కూడా అప్రూవ్ చేసింది. కాగా ఈ కోర్సు చేయాలనుకునేవారు.. జనవరి 31లోపు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇస్రో అందిస్తున్న కోర్సులో భాగంగా.. రిమోట్ సెన్సింగ్ అండ్ డిజిటల్ ఇమేజ్ అనాలిసిస్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆర్‌ఎస్ అండ్ జీఐఎస్ అప్లికేషన్స్ అనే నాలుగు మాడ్యుల్స్‌ను నేర్పిస్తారు. స్వయం ప్లాట్‌ఫామ్ వేదికగా ఇస్రో సంస్థకు చెందిన శిక్షణ, విద్యాసంస్థ అయిన ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్)’ ఫ్యాకల్టీ శిక్షణ ఇవ్వనుండగా, ఈ నెల 20 నుంచి మొదలవనున్న కోర్స్.. మే 5న పూర్తవుతుంది. పూర్తి వివరాల కోసం ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.