- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంట్లోనే ఉండండి.. ఆన్ లైన్ లో క్లాసులు వినండి : ఇస్కాన్
దిశ వెబ్ డెస్క్ : కరోనా కారణంగా ఇస్కాన్ కు సంబంధించిన గుళ్లన్నీ కూడా మూసి వేశారు. లాక్ డౌన్ ఎత్తివేసే విషయంలో ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో పాటు,, మరో పది హేను రోజులు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రచారం జరగడంతో ఇస్కాన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఒక వేళ లాక్ డౌన్ ఎత్తివేసిన ప్రజలు ఇల్లకే పరిమితం కావాలని, ప్రజలు, భక్తులంతా కూడా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ఇస్కాన్ ఆధ్యాత్మిక గురువు రాధానాథ్ స్వామి మహారాజ్ విజ్ఞప్తి చేశారు. ఇక ముందు ఇస్కాన్ ఆన్ లైన్ లో భక్తులను పలకరించునుంది.
లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఇస్కాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ కు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు యోగా క్లాసులు, ప్రవచనాలు, మెడిటేషన్స్ ఇక ఆన్ లైన్ లో నిర్వహించాలని డిసైడైంది. శ్రీకృష్ణ భక్తులంతా ఇంట్లోనే ఉండాలని కోరింది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లోని ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులకు సందేశం పంపింది. ఆయా దేశాల్లో తీసుకున్న లాక్ డౌన్ సహా ఇతర నిర్ణయాలను గౌరవించాలని కరోనా నివారణకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేసింది. ” సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, క్లాసెస్, సండే ప్రొగ్రామ్స్, మెడిటేషన్ అన్ని ఎప్పటిలాగే కొనసాగుతాయి. అందులో ఎటువంటి అంతరాయం లేదు. కాకపోతే అప్పుడు ప్రత్యక్షంగా జరిగే క్లాసులు ఇప్పడు పరోక్షంగా జరుగుతాయన్నది. ఇక ఇప్పటి నుంచే ఆన్ లైన్ లో మాత్రమే కొనసాగిస్తాం. భక్తులంతా వారి ప్రార్థనలు ఇంట్లోనే చేయాలి. వారికి అందుబాటులో ఉన్న టెంపుల్స్ ద్వారా ఆన్ లైన్ కార్యక్రమాలకు హాజరుకావాలి. ఆన్ లైన్ ద్వారానే శ్రీ కృష్ణ దర్శనం చేసుకోవాలి ” అని ఇస్కాన్ ఆధ్మాత్మిక గురువు రాధానాథ్ స్వామి మహారాజ్ తెలిపారు.
Tags :corona virus, lockdown, iskon, srikrishna devotees, radhanath swamy, yoga, meditation. online