సంజూ భాయ్ ఓ ఫైటర్ : ఇర్ఫాన్‌ఖాన్ కొడుకు

by Jakkula Samataha |
సంజూ భాయ్ ఓ ఫైటర్ : ఇర్ఫాన్‌ఖాన్ కొడుకు
X

లెజెండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్.. హీరో సంజయ్ దత్ గురించి హార్ట్ ఫెల్ట్ నోట్ రాశారు. తన తండ్రి ఇర్ఫాన్ ఖాన్‌కు క్యాన్సర్ అని తెలిసినప్పుడు నేనున్నానంటూ మాకు భరోసానిచ్చిన వ్యక్తి సంజూ భాయ్ అని.. నాన్న చనిపోయాక కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఒక మూలస్తంభంలా నిలబడ్డారని చెప్పాడు.

అలాంటి వ్యక్తి లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతుండగా.. తన హెల్త్ గురించి మీడియా ఊహాగానాలు రాయడం సరికాదన్నాడు. ఇది మీ బాధ్యతని తెలిసినా.. మానవత్వంతో ఆలోచించి సంజూ భాయ్‌కి, అతని కుటుంబానికి అవసరమైన ఫ్రీ స్పేస్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. మీడియా గురించి ఆందోళన చెందకుండా తనను పోరాడనివ్వాలని కోరాడు. సంజు ఒక టైగర్, ఫైటర్ అన్న బాబిల్.. గతం తనను నిర్వచించలేదని, కచ్చితంగా సంజూ క్యాన్సర్‌ను జయించి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. సంజూ భాయ్ మళ్లీ హిట్స్ కొడతాడని నమ్ముతున్నట్లు చెప్పాడు.

View this post on Instagram

Writers must wonder ‘how do I start’, but I am not a writer so here it is; I humbly request journalists and human curiosity to ease on the speculation, the details. I know that’s your job but I also know that a sense of humanity persists in our soul, so give Sanju bhai and his family the existential space they need. Here’s a secret; Sanju Bhai was one of the first people to offer help in all and every way when my father was diagnosed, after Baba passed, Sanju bhai was again one of the very first few people that held a pillar for support. Please; I beg you, let him fight this without anxiety of media, you must remember we’re talking bout Sanju baba here, he is a tiger, a fighter, the past doesn’t define you but it sure does evolve you and I know this will be over with Sanju Baba smashing hits again.

A post shared by Babil (@babil.i.k) on

కాగా, సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్ స్టేజ్ గురించి ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని ఆయన సతీమణి కోరిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed