రైలు ప్రయాణికులకు శుభవార్త.. IRCTC ద్వారా ఇకపై సులభతరమైన సేవలు

by Harish |
రైలు ప్రయాణికులకు శుభవార్త.. IRCTC ద్వారా ఇకపై సులభతరమైన సేవలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూ కాలర్ సంస్థ ఇండియన్ రైల్వేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రయాణికులకు కమ్యూనికేషన్‌పై ఎక్కువ నమ్మకాన్ని అందించడానికి భారతీయ రైల్వేతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని.. ప్రజలు -139 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసిన సమయంలో గ్రీన్ వెరిఫైడ్ బిజినెస్ బ్యాడ్జ్ లోగో వస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. వినియోగదారులు తమ బుకింగ్‌లు, ఇతర ప్రయాణ వివరాల గురించి IRCTC పోర్టల్ ద్వారా మాత్రమే సమాచారాన్ని స్వీకరిస్తున్నారని నిర్ధారించడానికి ఇది ఎంతగానో ఉపయెగపడుతుంది. అయితే, ట్రూ కాలర్‌తో కలిసి పనిచేయడం తమకు సంతోషంగా ఉందని భారతీయ రైల్వే తెలిపింది.

ట్రూ కాలర్‌ సాంకేతిక సహకారం వలన కస్టమర్లతో IRCTC యొక్క కమ్యూనికేషన్ ఛానెల్‌లను మరింత పటిష్టంగా, విశ్వసనీయంగా, సురక్షితంగా మార్చడానికి, వినియోగదారులకు వేగంగా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారాన్ని ఇవ్వడానికి ఇది ఉపయెగపడుతుంది. దీని వలన తమ విలువైన కస్టమర్లతో నమ్మకాన్ని పెంపొందించుకుంటామని IRCTC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజా తెలిపారు. భద్రత, వైద్యం, ఇతర ప్రత్యేక అవసరాలకు సంబంధించిన అభ్యర్థనలతో పాటు రైలు రిజర్వేషన్, రాక మరియు నిష్క్రమణకు సంబంధించి హెల్ప్‌లైన్‌కు ప్రతిరోజూ రెండు లక్షల కాల్స్ అందుతాయని తెలిపారు. ఇప్పటికే చాలా సంస్థలు ట్రూ కాలర్‌తో భాగస్వా్మ్యం పంచుకుంటుండగా.. తాజాగా అదే దారిలో IRCTC కూడా చేరింది.

Advertisement

Next Story

Most Viewed