అవినీతి ఆరోపణలు.. ఎస్‌ఐ సస్పెన్షన్!

by  |
అవినీతి ఆరోపణలు.. ఎస్‌ఐ సస్పెన్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్ :

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దోర్నాల SHO షేక్ అబ్దుల్ రహామాను ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ IPS ఆదేశాల మేరకు మంగళవారం గుంటూరు రేంజ్ ఐజీ జె.ప్రభాకర్ రావు సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు ఎస్సైలు ఎస్.మల్లిఖార్జున రావు, వై.పాండురంగారావు గతంలో కొమరోలు పీఎస్, గుడ్లూరు పీఎస్‌లలో పనిచేస్తున్న వీరిపై అవినీతితో పాటు, ఇతరులతో దురుసుగా ప్రవర్తించే వారని నిర్దారణ అయ్యింది. దీంతో వారిని వెంటనే విధుల నుంచి తొలగించి జిల్లా కేంద్రం వీఆర్‌కు ఆగస్టు 29న నాడు పిలిపించారు.

అంతకుముందు వీరిపై ఉన్న ఆరోపణలను ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ IPS పంపిన రిపోర్టు ఆధారంగా గుంటూరు రేంజ్ ఐజీ జే ప్రభాకర్ రావు ఇరువురి ఎస్‌ఐల మీద డిపార్ట్మెంటల్ మేజర్ పెనాల్టీకి ఆదేశాలిచ్చారు. వీరు ఇరువురి మీద నిష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుంది. వాటి నివేదిక ఆధారంగా శాఖాపరమైన చర్యలు, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం వున్నదని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.

ఇలాగే, ప్రకాశం జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో క్షేత్రస్థాయిలో పని చేస్తున్నటువంటి కె.వివేక్ కుమార్, చీరాల రూరల్, ఎస్.ఏ. రెహమాన్ , కందుకూర్ రూరల్, ఎం. వెంకటేశ్వర్లు, ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ స్టాఫ్‌ను కూడా విధుల నుంచి ఇవాళ తొలగించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారికి ఈ రకమైన ప్రక్రియ నిరంతరంగగా కొనసాగుతున్నదని జిల్లా ఎస్పీ వెల్లడించారు.


Next Story