- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
SRH Vs RCB: బెంగళూరులో ఆర్సీబీపై ఎస్ఆర్‌హెచ్ రికార్డు స్కోరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న తుఫాన్ ఫొటో
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటికే ముంబై జట్టుపై 277 స్కోరు చేసిన ఆరెంజ్ ఆర్మీ.. తన రికార్డును తానే చెరిపివేస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 287 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన మొట్టమొదటి జట్టుగా అవతరించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం ఆర్సీబీతో తలపడిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్లు బౌలర్లపై శివాలెత్తారు. మ్యాచ్ ప్రారంభం కాగానే ఓపెనర్లు మొదటి ఓవర్ నుంచే పరుగుల వరద పారించారు. వరుసగా ఒకరి తరువాత ఒకరు ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 39 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్సర్లతో 67 పరుగులు బంతులు చేశారు. అదేవిధంగా ఎయిడెన్ మార్క్‌రమ్ 32, అబ్దుల్ సమద్ 37 దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ జట్టు 287 పరుగులు చేసింది
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సన్‌రైజర్స్ జట్టు ఆటగాళ్లపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఒకే సీజన్‌లో.. ఒకే జట్టు రెండు సార్లు అత్యుత్తమ స్కోరును నమోదు చేయడం పట్ల క్రీడా పండితులు.. ఔరా ఇదేమి బ్యాటింగ్ అంటూ అవాక్కవుతున్నారు. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో ప్రత్యర్థి జట్లు ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ చూస్తేనే దడుచుకుంటున్నారంటే వాళ్ల బ్యాటింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇదే టైంలో నెట్టింట్లో ఆర్సీబీ జట్టుపై మీమ్స్ ఓ రేంజ్‌లో పేలుతున్నాయి. ఇక ట్విట్టర్‌లో సన్‌రైజర్స్ జట్టు బెంగళూరులో సన్‌రైజర్స్ రూపంలో భారీ తుఫాను వచ్చినట్లుగా ఫొటోను ట్వీట్ చేసింది. అయితే, ఆ ఫొటోలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంపై తుఫాన్ వచ్చినప్పుడు సుడిగుండంలా తిరుగుతున్న ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోకు క్యాప్షన్‌గా ‘చిన్నస్వామిలో తుఫాన్ ఎగిసిపడుతోంది’ అంటూ సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.