ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ ఔట్! కెప్టెన్‌‌గా సూర్యకుమార్

by Vinod kumar |   ( Updated:2023-03-30 11:17:06.0  )
ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ ఔట్! కెప్టెన్‌‌గా సూర్యకుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకి రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడు. రోహిత్ శర్మ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మ్యాచ్‌లకి దూరంగా ఉన్నా.. ముంబయి డగౌట్‌లో మాత్రం హిట్‌మ్యాన్ కనిపించనున్నాడు. వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబయి జట్టుని కొన్ని మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియా ఇంగ్లండ్ వేదికగా ఆసీస్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో వర్క్ లోడ్, గాయాల బెడద తగ్గించుకోవడం కోసం రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నిర్ణయాని ముంబై మెనేజ్ మెంట్‌కు తెలియజేసిన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రోహిత్ అందుబాటులో లేని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా కామెరూన్ గ్రీన్ బరిలోకి దిగనున్నట్టు సమాచారం. ఐపీఎల్ సీజన్ 16 మార్చి 31 న అహ్మదాబాద్ వేదికగా తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్నాయి. ముంబై తన తొలి మ్యాచ్ ఏప్రిల్ 1న బెంగళూర్ వేదికగా ఆర్సీబీతో ఆడనుంది..

Advertisement

Next Story