ఇందుకే కదా కోహ్లీ ‘కింగ్’ అయింది.. ఐపీఎల్ లో నయా రికార్డ్.. !

by Javid Pasha |   ( Updated:2023-04-16 13:01:25.0  )
ఇందుకే కదా కోహ్లీ ‘కింగ్’ అయింది.. ఐపీఎల్ లో నయా రికార్డ్.. !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ లో ఆయన క్రియేట్ చేసిన రికార్డులకు కొదువలేదు. అందుకే అభిమానులు ఆయనను ముద్దుగా ‘కింగ్ కోహ్లీ’ అని పిలుస్తుంటారు. సచిన్, ధోనీ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆటగాడు కోహ్లీ. కాగా ప్రస్తుతం ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న కోహ్లీ.. ఓ కొత్త రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై 2,500 పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లీ కొత్త రికార్డును నెలకొల్పాడు. టాటీ ఐపీఎల్ 2023లో భాగంగా శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ జట్టుపై 11 పరుగుల రన్స్ చేయడం ద్వారా ఒకే వేదికపై (చిన్నస్వామి స్టేడియం) 2,500 రన్స్ చేసిన మొదటి వ్యక్తిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవతున్నారు. కోహ్లీకి ఏదైనా సాధ్యమే అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed