టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్

by Javid Pasha |   ( Updated:2023-04-10 14:32:30.0  )
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్
X

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో జరగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లను ఓడగొట్టి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఎల్ఎస్జీ.. వరుసగా మూడో మ్యాచ్ గెలిచేందుకు ఉత్సాహంగా ఉంది. కాగా ఆర్సీబీ, ఎల్ఎస్జీ ఎదురుపడటం ఇది మూడోసారి. గత సీజన్ లో ఎల్ఎస్జీతో రెండు మ్యాచుల్లోనూ ఆర్సీబీయే గెలిచింది. ఈ క్రమంలోనే ఈసారి ఆర్సీబీని ఓడించి తమ సత్తా ఏంటో చాటుకోవాలనే లక్ష్యంతో ఎల్ఎస్జీ ఆటగాళ్లు ఉన్నారు.

ఇక ముంబైతో జరిగిన తమ మొదటి మ్యాచ్ లో సూపర్ విక్టరీ సాధించిన ఆర్సీబీ.. తర్వాత కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఎల్ఎస్జీతో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఆర్సీబీ ప్లేయర్లు ఉన్నారు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ను మూడోసారి ఓడగొట్టి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఆర్సీబీ సిద్ధంగా ఉంది. కాగా ఈ సీజన్ లో ఇది 15వ మ్యాచ్.

ఇక ఇరు జట్ల వివరాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు: డు ప్లెసిస్ (C), విరాట్ కోహ్లి, ఎం లోమ్రోర్, మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (WK), ఎస్ అహ్మద్, ఎ రావత్, హెచ్ పటేల్, డి విల్లీ, సిరాజ్, పార్నెల్.

లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు: KL రాహుల్ (C), K మేయర్స్, N పూరన్ (WK), దీపక్ హుడా, స్టోయినిస్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్, ఏ, ఖాన్, ఉనద్కట్, మార్క్ వుడ్.

Advertisement

Next Story

Most Viewed