- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: టాస్ గెలిచిన ఆర్సీబీ.. పిచ్ ఎవరికి అనుకూలం..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ తొలి గెలుపు కోసం వెయిట్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి ఈ సీజన్‌లో తమ ఖాతా తెరవాలని అనుకుంటోంది. ముంబయిని ఓడించిన ఆర్సీబీ జోష్‌లో ఉంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. రెండో మ్యాచులో కూడా కచ్చితంగా గెలవాలని గట్టి పట్టుదలగా ఉంది. ఈ ఏడాది ఆర్సీబీ చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఇద్దరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఆ జట్టు బలం రెట్టింపైంది. ఈ క్రమంలో కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో కూడా ఆర్సీబీనే ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది.
అయితే ఈ రెండు జట్లకు గాయాల బెడద గట్టి షాక్ ఇచ్చింది. శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఈ సీజన్‌కు దూరం అవడంతో నితీష్ రాణాకు కేకేఆర్ పగ్గాలు అందించిన సంగతి తెలిసిందే. అతని కెప్టెన్సీలో ఆడిన తొలి మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి పాలైంది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, మన్‌దీప్ సింగ్ ఇద్దరూ అంత గొప్పగా రాణించలేదు.
పిచ్ ఎవరికి అనుకూలం..
ఈడెన్ అంటే గుర్తొచ్చేది ఛేదన.. ఇక్కడ రెండో బ్యాటింగ్ సులువుగా ఉంటుంది. డ్యూ ఫాక్టర్ అదనపు ప్రయోజనం కల్పిస్తుంది. పెద్ద బౌండరీలు కావడంతో స్పిన్నర్లూ ప్రభావం చూపిస్తారు. మొదట్లో బంతిని స్వింగ్ చేయొచ్చు. బ్యాటర్లు నిలదొక్కుకుంటే సెంచరీలు కొట్టొచ్చు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI, ఇంపాక్ట్ ప్లేయర్స్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్) , విరాట్ కోహ్లీ, మైకేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాష్ దీప్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేశాయ్.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI, ఇంపాక్ట్ ప్లేయర్స్..
కోల్‌కతా నైట్ రైడర్స్:
నితీష్ రాణా (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), రింకు సింగ్, మన్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ అరోరా.
ఇంపాక్ట్ ప్లేయర్స్: అనుకుల్ రాయ్, మన్‌దీప్ సింగ్, జగదీషన్, డేవిడ్ వైస్.