IPL 2023: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్..

by Vinod kumar |   ( Updated:2023-05-11 14:07:42.0  )
IPL 2023: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ రేసు రసవత్తంగా మారిన నేపథ్యంలో నేడు కేకేఆర్, రాజస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ప్లే ఆఫ్ రేసులో ముందుంటుంది. అయితే రాజస్తాన్ గత 6 మ్యాచ్‌లో 5 ఓడిపోయింది. మరోవైపు కేకేఆర్ గత మ్యాచ్‌లో 4 మ్యాచ్‌లో మూడింటిల్లో మాత్రమే గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో రాజస్తాన్ 5, కేకేఆర్ 6వ స్థానంలో ఉన్నాయి.

ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి మూడు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు 6వ స్థానంలో కొనసాగుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కూడా ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

రహ్మానుల్లా గుర్బాజ్(w), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(c), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, KM ఆసిఫ్, యుజువేంద్ర చాహల్

Advertisement

Next Story