IPL 2023: నేడు లక్నోతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ..

by Vinod kumar |   ( Updated:2023-04-30 18:45:53.0  )
IPL 2023: నేడు లక్నోతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. లక్నో తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుతమైన విజయం సాధించింది. లక్నో చివరి మ్యాచ్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించింది.. 257 పరుగులు చేసింది - టోర్నమెంట్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించారు. అయితే బౌలర్లు చాలా పరుగులు ఇస్తుండంతో కొంత ఆందోళన లక్నో జట్టులో ఉన్నది. మరోవైపు ఆర్సీబీ తన చివరి మ్యాచ్‌లో హోమ్ గ్రౌండ్‌లో ఓటమిని చవిచూసింది. ఆర్సీబీ బ్యాటర్స్ 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. అయితే విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌లతో సహా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ఆర్డర్ నిలకడగా స్కోర్లు చేస్తోంది.

లక్నో సూపర్ జెయింట్స్ (అంచనా):

KL రాహుల్ (c), కైల్ మేయర్స్, ఆయుష్ బడోని, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (WK), నవీన్-ఉల్-హక్, అవేష్ ఖాన్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (అంచనా):

విరాట్ కోహ్లీ (సి), ఫాఫ్ డు ప్లెసిస్, షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్), సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్

Advertisement

Next Story