పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ఢిల్లీ క్యాపిటల్స్..

by Anjali |   ( Updated:2023-05-18 01:57:33.0  )
పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ఢిల్లీ క్యాపిటల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో కీలక మ్యాచులు ఉత్కంఠ బరితంగా జరుగుతున్నాయి దాదాపు మూడు ప్లే ఆఫ్ స్థానాలకు 7 జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య 64వ మ్యాచ్ జరిగింది. పంజాబ్ లోని ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 20 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 214 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన పంజాబ్ కు ధావన్ గోల్డెన్ డక్ కావడంతో కష్టాల్లోకి వెల్లింది. అతర్వ 55, లివింగ్‌స్టోన్ 94 పరుగులతో రాణించినప్పటికి పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేసి.. 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ రేసు క్లిష్టతరంగా మారిపోయింది.

Advertisement

Next Story