ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త ప్లాంట్!

by Harish |
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త ప్లాంట్!
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్స్‌టైల్స్ రంగానికి కావాల్సిన ముడి పదార్థాలను తయారు చేసేందుకు ఒడిశాలోని పారదీప్‌లో రూ. 13,805 కోట్లతో కొత్త ప్లాంట్‌ను నెలకొల్పాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీఎల్) వెల్లడించింది. నూతనంగా నిర్మించే ఈ ప్లాంటును 2024 నాటికి పూర్తి చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఐవోసీఎల్ రిఫైనరీకి అనుబంధంగా పారాక్సిలిన్, శుద్ధి చేసిన టెరిఫ్థాలిక్ యాసిడ్ ప్లాంటును పారదీప్‌లో ఏర్పాటు చేయనున్నారు.

సంవత్సరానికి 8 లక్షల టన్నుల వరకు ఈ ప్లాంటులో తయారు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. పారాక్సిలిన్ వినియోగించి సంవత్సరానికి 12 లక్షల టన్నుల టెరిఫ్థాలిక్ యాసిడ్‌ను తయారు చేయనున్నట్టు ఐవోసీఎల్ పేర్కోంది. పాలిస్టర్ తయారు చేసేందుకు అవసరమైన ముడి పదార్థాన్ని టెరిఫ్థాలిక్ యాసిడ్ అంటారని ఐవోసీఎల్ వివరించింది. ఈ ప్లాంటును మూడేళ్ల కాలంలో నిర్మించనున్న నేపథ్యంలో ఈ కాలంలో దాదాపు అన్ని రోజులు కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఐవోసీఎల్ అధికారి ఒకరు వెల్లడించారు.

Advertisement

Next Story