పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

by Shyam |   ( Updated:2020-06-16 03:53:03.0  )
పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, మెదక్: వివిధ రంగాలలో సేవలు అందించిన అర్హుల నుంచి పద్మ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు.. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జయరాజ్ తెలిపారు. కళలు, సామాజిక సేవ కార్యక్రమాలు, సైన్స్, ఇంజనీరింగ్ వృత్తి, పరిశ్రమలు, అక్షరాస్యత, విద్య, వైద్య సేవ, సివిల్ సర్వీసెస్, క్రీడా రంగాలలో అర్హులైన వారు www.Padma awards.gov.in వెబ్‌సెట్ ద్వారా దరఖాస్తు, ఇతర వివరాలు పొందాలని సూచించారు. జిల్లాలో అర్హులైన వారు అవసరమైన ధ్రువపత్రాలను జత చేసి, ఈ నెల 19 వరకు కలెక్టరేట్‌లోని యువజన క్రీడల శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని, వివరాలకు 08452-223676 నెంబర్ సంప్రదించాలని సూచించారు.

Advertisement

Next Story