- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండిగో త్రైమాసిక నష్టం రూ. 1,195 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 1,194.80 కోట్ల నికర నష్టాలను వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ. 1,062 కోట్ల నష్టాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ మొత్తం ఆదాయం 64.50 శాతం క్షీణించి రూ. 3,029.2 కోట్లకు చేరుకోగా, ఎబిటా 59.30 శాతం పెరిగి రూ. 408.50 కోట్లకు చేరుకుంది.
ఈ త్రైమాసికంలో ప్రయాణీకుల టికెట్ ఆదాయం రూ. 2,208.2 కోట్లతో 68.9 శాతం తగ్గాయి. సెప్టెంబర్ చివరి నాటికి ఇండిగో మొత్తం రూ. 17,931.8 కోట్ల బ్యాలెన్స్ కలిగి ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో నెమ్మదిగా కోలుకుంటున్నామని, ఖచ్చితంగా సాధారణ సామర్థ్యానికి తిరిగి చేరుకుంటాం. ప్రస్తుత సంక్షోభంపై దృష్టీ కేంద్రీకరించాం. భవిష్యత్తులో తక్కువ ఖర్చులు, బలమైన ఉత్పత్తి, మరింత సమర్థవంతమైన విమాన సర్వీసులను కలిగి ఉంటామని’ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సీఈవో రొనొజోయ్ దత్తా తెలిపారు.