- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మర్కజ్‌ను నిందించడం మాని.. కరోనాను నివారించాలి
దిశ, న్యూస్‌బ్యూరో :
రాష్ట్రంలోని కరోనా కేసులకు మర్కజ్ వెళ్లొచ్చినవారిని బాధ్యులను చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలని కోరుతూ వివిధ ప్రజాసంఘాలు, మేధావులు, ప్రొఫెసర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. కరోనా వైరస్‌కు మతం, కులం, లింగ వివక్షత లేదని డబ్లూహెచ్ఓ ప్రకటించిందని, అయినా మన దగ్గర ఒక మతానికి దాన్ని అంటగట్టారని లేఖలో పేర్కొన్నారు. ఐసీఎంఆర్ నిబంధనలను పక్కకు పెట్టిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తెలిపారు. కొవిడ్ పరీక్షలను చాలా తక్కువ సంఖ్యలో చేసిన రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం కూడా ఉందని, కరోనా వారియర్స్ అందరికీ పరీక్షలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ముస్లింలతో మాత్రమే కరోనా వ్యాపిస్తుందని తెలంగాణ సమాజం భావించే స్థితికి పరిస్థితి చేజారిపోయిందని, రాష్ట్రంలో మత విద్వేషాలు తొలగిపోయేందుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో హెచ్‌సీయూ, ఓయూ, ఎన్ఎపీఎం, ప్రొఫెసర్లు గీతాంజలి జాషువా, సూరేపల్లి సుజాత, పద్మజా షా, శ్రద్ధ, రచయిత మెర్సీ మార్గరెట్, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన మొత్తం 101 మంది ఉన్నారు.
Tags: Telangana, corona, Lock down, OU, ICMR, Professors