- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత మహిళా జడ్పీచైర్‌పర్సన్‌కు అవమానం
దిశ ప్రతినిధి,వరంగల్/ భూపాలపల్లి: దళితుల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ఓ వైపు చెబుతూనే.. మరోవైపు దళిత ప్రజాప్రతినిధులను అవమానాలకు గురి చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా దళిత మహిళా జడ్పీ చైర్ పర్సన్ జక్కు హర్షిణిపై జరుగుతున్న రాజకీయ వివక్షే ఇందుకు నిదర్శనమని చెప్పాలి. జడ్పీ చైర్‌పర్సన్ హర్షిణి రాజకీయ ఉనికి లేకుండా చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రొద్బలంతో పార్టీలో, జడ్పీ పాలక వర్గంలోనూ ఆమెపై వివక్ష కొనసాగుతోందన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు కూడా ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం దక్కకుండా తమకు చేతనైనా సాయం ప్రజాప్రతినిధులకు చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
భూపాలపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న ఏ ప్రభుత్వ కార్యక్రమానికి ఆమెకు ఆహ్వానం, పిలుపు ఉండటం లేదన్న చర్చ పార్టీలో, ప్రభుత్వ వర్గాల్లో చాలాకాలంగా జరుగుతోంది. ఈ విషయం నిజమేనని నిరూపించే సంఘటన ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి సోమవారం ఆరంభించేందుకు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, సివిల్ సప్లై శాఖల మంత్రి గంగుల కమాలాకర్ పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలోనే జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత పేరుతో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌కు ఆహ్వానం వెళ్లింది. అయితే జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న జక్కు హర్షిణి పేరును ఇన్విటేషన్‌లో పేర్కొనకపోవడం గమనార్హం. జడ్పీ చైర్‌పర్సన్‌పై రాజకీయ వివక్ష, ప్రొటోకాల్ పాటించకపోవడం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్న వేళ ఈ పరిణామం తేటతెల్లం చేసిందని చెప్పాలి. జక్కు హర్షిణి దళిత ప్రజాప్రతినిధి కావడంతోనే ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు ఆమెపై రాజకీయ వివక్ష చూపుతున్నారన్న విమర్శలు భూపాలపల్లి ప్రజానీకం నుంచి వినిపిస్తున్నాయి. జక్కు హర్షిణిపై రాజకీయ వివక్ష కొనసాగుతున్న విషయంపై దిశ పత్రిక గతంలోనే కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అధికారులు తమ అధికార తప్పిదాన్ని రుజువు చేసుకున్నారు.