- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్టాకు బానిసయ్యారా.. అయితే మీ కోసమే ఈ ఫీచర్!
దిశ, వెబ్‌డెస్క్ : మీరు ఇన్‌స్టాగ్రామ్‌ను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త! ఫేస్ బుక్ (Facebook ఇప్పుడు మెటా) యాజమాన్యంలోని ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ త్వరలో స్క్రీన్ టైమ్ నుండి బ్రేక్ తీసుకోమని మిమ్మల్ని అడుగుతుంది. మా సంస్థ ఓ కొత్త ఫీచర్‌పై పనిచేస్తోందని ప్రకటనను జారీ చేసింది. ‘టేక్ ఎ బ్రేక్’ అని పిలువబడే ఈ కొత్త ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌కు బానిసలైన వారిని కాసేపు బ్రేక్ తీసుకొనేలా చేస్తుంది.
ఫేస్ బుక్ యాప్‌లలో ఎక్కువగా బానిసలైన యాప్ ఏదైనా ఉందా అంటే అది ఇన్ స్టాగ్రామ్ అని కొన్ని నివేదికలలో వెళ్లడైయింది. దీంతో ఈ కొత్త ఫీచర్‌ను ఆ సంస్థ తీసుకొస్తోంది. అయితే ఈ కొత్త ఫీచర్ డిఫాల్ట్‌గా పని చేయదు. యూజర్స్ 10, 20 లేదా 30 నిమిషాల గ్యాప్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ యాప్ నుండి బ్రేక్ తీసుకోవడానికి యాప్‌లోని రిమైండర్ ఆప్షన్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి కంపెనీ ఈ తాజా ఫీచర్‌ను ట్విట్టర్‌లో ఒక చిన్న వీడియోను పోస్ట్ చేసి ప్రకటించింది. అయితే ఈ ఫీచర్‌ను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేపట్టనట్టు ఆ సంస్థ తెలిపింది.