- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉగ్రవాదిగా నితిన్?
దిశ, వెబ్‌డెస్క్: టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘చెక్’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, పోస్టర్లు చిత్రంపై అంచనాలను పెంచగా. ఈ రోజు (ఆదివారం) విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్‌ను పెంచింది.
ఫస్ట్ గ్లింప్స్ తొలి షాట్‌లోనే నితిన్ జైల్లో ఖైదీగా దర్శనమిచ్చాడు. ఆ తర్వాత వాయిస్ ఓవర్‌లో ‘జైల్లో ఆదిత్య అనే ఖైదీ.. చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు’ అని వినిపించగా, అద్భుతంగా అంటే.. ‘విశ్వనాథన్ ఆనంద్, కాస్పరోవ్’ అలాగేనా? అంటూ మరొక వాయిస్. ఇక ఉరిశిక్ష పడ్డ ఐదుగురు ఖైదీలను ఉరితీయాలని జడ్జి తీర్పు ఇవ్వడంతో పోలీసులు నితిన్‌ను సెల్ నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత నితిన్‌ను పట్టుకుని.. ‘నువ్వో టెర్రరిస్ట్.. అది నీ గుర్తింపు’ అని సంపత్ రాజ్ చెప్తుండగా, అతడు ఇన్నోసెంట్ అని రకుల్‌ప్రీత్ చెబుతుంది. ఇంతకీ నితిన్ తీవ్రవాదా? తనకు ఉరిశిక్ష పడుతుందా? అసలు తను చేసిన నేరం ఏంటి? నితిన్‌తో పాటు శిక్షపడ్డ మిగతా నలుగురు ఖైదీలు ఎవరు? నేరస్థుడికి, చెస్‌కు సంబంధమేంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఫస్ట్ గ్లింప్స్.. సినిమా ఇంటెన్స్‌ను మరింత పెంచింది. మరి ఈ మూవీలో ఎవరు ఎవరికి చెక్ పెడతారో తెలియాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
చిత్రంలో నితిన్‌కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో రకుల్ తొలిసారి లాయర్ పాత్రలో కనిపించనుంది. ఇక నితిన్ నటించిన మరో మూవీ ‘రంగ్ దే’ సంక్రాంతికి విడుదల కానుండగా, అంధాధున్ తెలుగు రీమేక్ ప్రాజెక్ట్ వివరాలు తెలియాల్సి ఉంది.
Meet Aditya aka @actor_nithiin from #Check ♟
Here's The #CheckFirstGlimpse
▶️ https://t.co/0VXo6KiHiU@yeletics @Rakulpreet #PriyaPrakashVarrier #VAnandaPrasad @BhavyaCreations pic.twitter.com/HsKIb3kjgJ
— BARaju (@baraju_SuperHit) January 3, 2021