ఖమ్మం జిల్లాలో దారుణం.. మాపై వార్తలు రాస్తావా అంటూ విలేకరులకు బెదిరింపు కాల్స్

by  |   ( Updated:2021-11-19 00:30:25.0  )
Manuguru-1
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పేద ప్రజలకు న్యాయం జరగడం లేదని కొంతమంది ప్రముఖ మేధావుల సర్వేలో తేలింది. నియోజకవర్గంలో పేద ప్రజలు అనేక రకమైన సమస్యలతో బాధపడుతున్నారని, ఆ సమస్యలను తీర్చడానికి ఏ ఒక్కఅధికారి, ఏ ఒక్కసరైన నాయకుడు లేరని పేదప్రజలు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. పేదప్రజలకు తిండి, భూమి, ఇల్లు, ఉద్యోగం అన్ని వసతులు సమతుల్యంగా ఉన్నాయా అంటే లేవనే కొందరి మేధావులు చర్చిస్తున్నారు. పేదప్రజలకు కష్టం వస్తే నాయకులు, అధికారులు పట్టించుకోకుండా, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి సమస్యలను తీర్చలేని విధంగా నియోజకవర్గం మారిందని ప్రముఖ మేధావులు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో పేదప్రజలకు న్యాయం జరగడంలేదని పలువురి మేధావుల ద్వారా తేటతెల్లమౌతుంది. పేద ప్రజలకు భూ సమస్యనే ఎక్కువగా మారిందని ప్రముఖ మేధావులు మాట్లాడుకుంటున్నారు. నియోజకవర్గంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా…లేదా… అనేది పెద్దసమస్యగా మారింది.

అక్రమాలను, దందాలను ఆపేదెవరు…?

నియోజకవర్గంలో జరిగే భూకబ్జాలు, ఇసుక దందాలు, బెల్ట్ షాప్ దందాలు, వడ్డీల దందాలు తదితర ఎన్నో దందాలను ఆపేవారే లేరా అని నియోజకవర్గ ప్రముఖ మేధావులు ప్రశ్నిస్తున్నారు. పేదప్రజల భూములను నియోజకవర్గంలోని కొంతమంది వ్యక్తులు కబ్జా చేస్తుంటే వారికి న్యాయం చేసేవారు లేరా అని మేధావుల ప్రశ్నిస్తున్నారు. భూములను కబ్జా చేయడం.. వెంటనే దొంగ డాకుమెంట్స్ ను సృష్టించడం.. భూములను దోచుకోవడం జరుగుతోంది. పేద ప్రజలను కాపాడాల్సిన అధికారులే కబ్జాదారులు ఇచ్చే రూపాయలకు కక్కుర్తి పడి అన్యాయం చేస్తున్నారని నియోజకవర్గ ప్రముఖ మేధావుల సర్వేలో తేలింది. ఇకపోతే పినపాక నియోజకవర్గంలో ఇసుకదందాకు పెట్టింది పేరు అన్నట్లుగా అడ్డుఅదుపు లేకుండా చేస్తున్నారని.. కొంతమంది అధికారులు పూర్తిగా దందారులకే సహకరిస్తున్నారని ప్రముఖ మేధావుల వాదన. పేదవాడి భూమి, ఇల్లు కబ్జా చేస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నియోజకవర్గంలో ఏర్పడింది. మరి ఈ దందాలను ఆపేదెవరనేది నియోజకవర్గంలో ప్రశ్నార్థకంగా మారింది.

నియోజకవర్గంలో ప్రభుత్వాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు ?

నియోజకవర్గంలో స్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, బెల్ట్ షాప్ మాఫియా, సిండికేట్ మాఫియా తదితర ఎన్నోదందాలు జరుగుతున్నా ప్రభుత్వాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది నియోజకవర్గంలో సంచలంగా మారింది. అధికారులే మౌనంగా ఉంటే పేదప్రజల పరిస్థితి ఏంటని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు ప్రతి దాంట్లో వాటా ఉన్నదని, అందుకే ఇంతలా అక్రమాలు, దందాలు జరుగుతున్నాయని నియోజకవర్గంలో కొందరు ప్రముఖులు చర్చించుకుంటున్నారు. అక్రమార్కులపై సరైన చర్యలు లేకపోవడం వలనే ఈ దందాల అన్నిటికీ కారణమని ప్రజలు, విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. అధికారులు ఎప్పుడో ఒక్కసారి నామమాత్రంగా చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిలేదని ప్రజలు గుసగుసలాడుతున్నారు. అధికార పార్టీకో లేక కొందరి వ్యక్తులకో భయపడి చర్యలు తీసుకోవడం లేదని కొంత విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వాధికారులు దందాలను అరికట్టకపోతే నియోజకవర్గం కబ్జామయమైపోతుందని అవుతదని కొందరి ప్రముఖుల వాదన.

పత్రిక విలేకరులపై బెదిరింపులు

సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని క్షుణంగా ప్రజలకు చేరవేయడంలో పత్రిక విలేకరిది ప్రధాన పాత్ర. ప్రభుత్వ ఉద్యోగం కాదు…నెల జీతం రాదు… అక్రమాలను వెలికితీసి, నీతి నిజాయితీగా వార్తలు ప్రచురిస్తే పత్రిక విలేకరులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని కొందరి మేధావులు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో కొందరు విలేకరులు నిజమైన వార్తలు ప్రచురిస్తుంటే కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. బెదిరిస్తున్నారంటే అక్రమాలకు పాల్పడుతున్నారనే అర్థం తేటతెల్లమౌతుంది. సమాజానికి పత్రిక విలేకరి ఎంతో అవసరమని నేటి ప్రముఖుల మాట. కానీ.. ఆ విలేకరినే బెదిరింపులకు గురిచేయడం దుర్మార్గమైనచర్య అని మాట్లాడుతున్నారు. పత్రిక విలేకరులపై దాడులు చేస్తే పీడీ యాక్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు, ప్రజా సంఘాలు, మహిళ సంఘాలు, పలువురు మేధావులు కోరుతున్నారు.

జిల్లా కలెక్టర్ పట్టించుకోవాలని నియోజకవర్గ ప్రజల ఆవేదన

నియోజకవర్గంలో స్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, బెల్ షాప్ మాఫియా, సిండికేట్ మాఫియా, వడ్డీల మాఫియా తదితర ఎన్నోదందాలు జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదని ప్రజలు తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో స్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, రెవెన్యూ మాఫియా ఎక్కువగా విచ్ఛలవిడిగా జరుగుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. వీటిని అరికట్టేవారే లేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తే అక్రమాలకు అడ్డుకట్టవేయవచ్చని ప్రజలు, ప్రజా సంఘాలు, కొందరు మేధావులు కోరుతున్నారు. నియోజకవర్గంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తోరో లేదో అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story