- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో సెక్షన్ ఆఫీసర్ కి గాయాలు
by Sumithra |
X
దిశ, నర్సంపేట : విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఓ అటవీ అధికారి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. విశ్వసనీయ కథనం ప్రకారం… నర్సంపేటలోని ఫారెస్ట్ ఆఫీస్ లో మొబైల్ పార్టీ సెక్షన్ ఆఫీసర్ గా వెంకటేశ్వర్లు (55) అనే వ్యక్తి నాలుగు రోజుల కిందట జాయిన్ అయ్యారు. శనివారం సాయంత్రం నర్సంపేట పరిధిలో విధులు ముగించుకొని హన్మకొండలోని ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.
గీసుకొండ మండలంలోని కొమ్మాల సమీపంలో గల తండా వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అకస్మాత్తుగా ఓ గేదె అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వేంకటేశ్వర్లుకి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర్లు గతంలో కొత్తగూడ మండలంలో పని చేసి ఇటీవలే నర్సంపేటకి బదిలీ అయ్యారు.
Advertisement
Next Story