- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్ఫోసిస్‌లో పెరుగుతున్న కోటీశ్వరులు
దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో కోటీశ్వరుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రతి సంవత్సరం ఈ కంపెనీలోని కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. కోటికి పైగా వార్షిక వేతనం తీసుకున్న వారు 74 మంది ఉన్నారట. అంతకుముందు ఏడాది కంటే ఈసారి 10 మంది పెరిగారు. గతేడాది ఇండియాలోని ఇన్ఫోసిస్ ఉద్యోగుల సగటు జీతం పెరుగుదల 7.3 శాతం ఉండేది. ఇక ఈ ఏడాది కోటికిపైగా జీతం తీసుకుంటున్న వారిలో వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో ఉన్నవారేనని తెలుస్తోంది. గతేడాది వీరికి మంజూరు చేసిన షేర్ల ఆధారంతో వార్షిక వేతన పెరిగిందని సమాచారం. గతేడాది ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ. 34 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నారు. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఐటీ సీఈవో సలీల్ పరేఖ్ అవడం గమనార్హం. ఇక, 2019-20 ఆర్థిక సంవత్సరంలో మధ్య స్థాయి వేతనం 10 శాతం పెరిగి రూ. 6.8 లక్షలకు చేరుకుందని ఇన్ఫోసిస్ నివేదికలో వెల్లడించింది. అలాగే, రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్లను విజయవంతంగా సాంకేతికతను ఉపయోగించి ఎదుర్కోవాలని, ఇదే అసలైన పరీక్ష అని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని వాటాదారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.