- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళేశ్వరం వద్ద మళ్లీ సేమ్ పొజిషన్
దిశ ప్రతినిది, కరీంనగర్: కాళేశ్వరం వద్ద మళ్లీ గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. 10.70 మీటర్ల ఎత్తు వరకు నీరు వచ్చి చేరింది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో వరద నీరు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. మహారాష్ట్రలోని పెన్ గంగపై నిర్మించిన గోషై కుర్దా ప్రాజెక్టు వద్ద భారీగా ఇన్ ఫ్లో వస్తుండడంతో అధికారులు ఆదివారం 46 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో కాళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరిగింది.
నిన్నటి వరకు 1 లక్ష క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లోగా రాగా ఒక్క రోజులోనే 5.21 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో మేడిగడ్డ వద్ద 65 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు ఇప్పటికే 5. 15 టీఎంసీల నీటిని ఇరిగేషన్ అధికారులు నిలువ ఉంచారు. అయితే అనూహ్యంగా మహారాష్ట్ర నుండి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో ఇన్ ఫ్లోగా వచ్చే నీటినంతా కూడా దిగువకు వదులుతున్నారు.