క్షీణించిన పారిశ్రామికోత్పత్తి

by Harish |
క్షీణించిన పారిశ్రామికోత్పత్తి
X

దిశ, వెబ్‌డెస్క్: పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) మరోసారి క్షీణించింది. మైనింగ్, తయారీ ఉత్పత్తి తగ్గడంతో ఫిబ్రవరి నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి 3.6 శాతం కుదించుకుపోయింది. గతేడాది ఫిబ్రవరిలో ఐఐపీ 5.2 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జనవరిలో 1.6 శాతం మాత్రమే పారిశ్రామికోత్పత్తి క్షీణించింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన దాని ప్రకారం.. విద్యుత్ ఉత్పత్తి స్వల్పంగా పెరిగింది. మైనింగ్ ఉత్పత్తి 5.5 శాతం, తయరీ 3.3 శాతం తగ్గింది. విద్యుత్ ఉత్పత్తి 0.1 శాతం వృద్ధి నమోదు చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తుండటంతో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామికోత్పత్తి దెబ్బతిన్నది. గతేడాది కరోనా వ్యాప్తి ప్రారంభమైన సమయంలో ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు వరుసగా ఐదు నెలలు ఐఐపీ క్షీణించింది.

Advertisement

Next Story