నిర్వహణ వ్యయం తగ్గించుకోనున్న ఇండిగో

by Harish |
నిర్వహణ వ్యయం తగ్గించుకోనున్న ఇండిగో
X

దిశ, సెంట్రల్ డెస్క్: ఇప్పటికే త్రైమాసిక నష్టాలను నమోదు చేసిన ఇండిగో సంస్థ ద్రవ్య లభ్యతను పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆస్తులపై రుణాలను తగ్గించుకోవడం ద్వారా ద్రవ్యలభ్యతను పెంచుకుంటామని ఇండిగో సీఈవో రోనో దత్తా తెలిపారు. నష్టాల్లో ఉన్న సంస్థను తిరిగి లాభాల్లోకి తీసుకొస్తామని, ఇతర సంస్థలకు విక్రయించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఒంటరిగానే ప్రయాణం కొనసాగిస్తామని, సంస్థను ఎవరి చేతుల్లోనూ వెళ్లకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పాత విమానాల కారణంగా నిర్వహణ వ్యయం పెరగడంపై ఇండిగో దృష్టి సారించింది. కొత్త ఆదాయ నమూనాలు, నెట్‌వర్క్ ప్రయాణాలను నిర్వహించాలని ఇండిగో నిర్ణయించింది. నిర్వహణ వ్యయాలు ఎక్కువగా ఉన్న ఏ320 సియో విమానాలను రానున్న రెండేళ్లలో తొలగించి కొత్త విమానాలను కొనుగోలు చేస్తామని ఇండిగో అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇండిగో చేతిలో ప్రస్తుతం 262 విమానాలున్నాయి. ఇటీవల తీసుకున్న చర్యలతో రానున్న 9 నెలల్లో సంస్థకు రూ. 4000 కోట్ల వరకు అదనపు ద్రవ్య లభ్యత ఉండొచ్చని ఇండిగో అంచనా వేస్తోంది.

Advertisement

Next Story