పన్ను ఆదాయం దేశ జీడీపీలో 4 శాతం కంటే తక్కువగా ఉంది: ఎన్‌కే సింగ్

by Harish |
పన్ను ఆదాయం దేశ జీడీపీలో 4 శాతం కంటే తక్కువగా ఉంది: ఎన్‌కే సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత పన్ను ఆదాయ సామర్థ్యం దేశ జీడీపీలో 4 శాతం కంటే తక్కువగా ఉందని, రెవెన్యూ ఆధారిత వ్యవస్థలో దేశం లోతైన సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని 15వ ఆర్థిక కమిషన్ ఛైర్మన్ ఎన్‌కే సింగ్ చెప్పారు. రాష్ట్రాలను ప్రోత్సాహక విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని, తద్వారా రాష్ట్రాల విధానాలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సీఎస్ఈపీ-ఐఎంఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రత్యక్ష, పన్నుల విధానాల్లో మార్పులు చేయాలని, రెవెన్యూ వ్యవస్థలో లోతైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 4 శాతం కంటే తక్కువ ఉండటం వల్ల భారత్ ఆదాయ పరంగా ఆర్థిక సామర్థ్యాన్ని కోల్పోతుంది. తగ్గిన పన్ను ఆదాయాన్ని సాధించగలిగితే అందులో కొంత భాగాన్ని అనివార్యమైన ఖర్చుల కోసం, మహమ్మారి అవసరాలకు, ఆరోగ్య వ్యయానికి సమకూర్చేందుకు సహాయపడుతుందని ఎన్‌కే సింగ్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed