ఆందోళన కలిగిస్తున్న ఆ సంస్థ అనలిటిక్స్

by Harish |
ఆందోళన కలిగిస్తున్న ఆ సంస్థ అనలిటిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ద్రవ్యోల్బణం ‘అత్యధిక స్థాయి’లో ఉందని, ఇది ఆసియాలోని ఇతర ఆర్థికవ్యవస్థల కంటే అధికమని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ అనలిటిక్స్ మంగళవారం తెలిపింది. అధిక ఇంధన ధరలు రిటైల్ ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తెచ్చాయి. దీనివల్ల ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్ అభిప్రాయపడింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5 శాతానికి పెరిగింది. ఇది జనవరిలో 4.1 శాతంగా నమోదైంది. ఆర్‌బీఐ ద్రవ్య విధానాలను నిర్ణయించే ముందు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ప్రస్తుత ద్రవ్యోల్బణం ఆందోళన కలిగించేదిగా ఉందని మూడీస్ పేర్కొంది.

ఆసియాలో చాలావరకు ద్రవ్యోల్బణం తగ్గిందని, అయితే పెరుగుతున్న చమురు ధరలు, ఆర్థిక వ్యవస్థలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో 2021లో ద్రవ్యోల్బణం పెరుగుతుందని మూడీస్ అంచనా వేసింది. ఆసియా ప్రాంతంలో భారత్‌లోనే ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. దీనివల్ల ఆర్‌బీఐ పాలసీ విధానంలో మార్పులు ఉండకపోవచ్చు. భారత ద్రవ్యోల్బణం ఆందోళన కలిగించేదిగా ఉంది. 2020లో పలు సార్లు ఆహార ధరలు, చమురు ధరలు పెరగడంతో 6 శాతం వరకు ద్రవ్యోల్బణం పెరిగిదని, దీంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశం ఉందని మూడీస్ అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed