వృద్ధి అంచనాను సవరించిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్

by Harish |
వృద్ధి అంచనాను సవరించిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును పలు రేటింగ్ ఏజెన్సీలు తగ్గిస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వృద్ధి అంచనాలను తగ్గించగా, తాజాగా ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) కూడా భారత జీడీపీ వృద్ధి రేటును 10.1 శాతం నుంచి 9.6 శాతానికి తగ్గించింది. టీకా పంపిణీ అనుకున్నంత వేగవంతంగా జరక్కపోతే వృద్ధి మరింత క్షీణించే అవకాశం ఉందని వెల్లడించింది. కరోనా సెకెండ్ వేవ్ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధి అంచనాలను సవరించినట్టు ఇండ్-రా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లోని వయోజనులందరికీ టీకా అందించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తున్న ఉన్న దానికంటే వేగవంతంగా టీకా ప్రక్రియ కొనసాగిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని ఇండ్-రా అభిప్రాయపడింది.

ఒకవేళ టీకా అందించే ప్రక్రియ మూడు నెలలు ఆలస్యమైతే వృద్ధి 9.1 శాతానికి పడిపోతుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. కరోనా పరిస్థితుల కారణంగా ఆర్థికవ్యవస్థలో వినియోగం బాగా మందగించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆదాయం మొత్తం గ్రామీణ ఆదాయంలో మూడింట ఒక వంతు మాత్రమే అయినప్పటికీ అనేక వ్యవసాయేతర గ్రామీణ కార్యకలాపాల్లో ఎక్కువ మందికి జీవనోపాధిని అందిస్తోంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలకు సైతం కొవిడ్ చేరుకోవడంతో వినియోగం దెబ్బతింటోందని, ప్రస్తుత ఏడాది వ్యవసాయ వృద్ధి 3 శాతానికి తగ్గే అవకాశం ఉందని తెలిపింది. పారిశ్రామిక రంగం 10.9 శాతం వృద్ధితో మెరుగ్గా ఉండోచ్చని పేర్కొంది. విమానయానం, పర్యాటకం, హోటల్, క్రీడలు, ఎంటర్‌టైన్‌మెంట్, ఆతిథ్య రంగాలు ఇంకా మందగమన స్థాయిలోనే ఉన్నాయని ఇండ్-రా వెల్లడించింది

Advertisement

Next Story

Most Viewed