ఇండియానాపొలిస్‌ లో కాల్పలు కలకలం.. 8 మంది మృతి

by Shamantha N |
ఇండియానాపొలిస్‌ లో కాల్పలు కలకలం.. 8 మంది మృతి
X

న్యూయార్క్ : అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఇండియానాపొలిస్‌‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపాన దుండగుడు కాల్పులకు పాల్పడ్డారు. ఫెడెక్స్ కార్గో డెలివరీ సంస్థ కార్యాలయం వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 8 మంది మరణించారని పలు మీడియా కథనాల ద్వారా తెలుస్తున్నది. కాల్పులు జరిపిన వ్యక్తి అధునాతనమైన మెషిన్ గన్‌తో షూట్ చేయడంతో అనేకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని ఇండియానాపొలిస్ పోలీస్ అధికారి జెనే కుక్ తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుడు.. తనను తాను కాల్చుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Next Story