- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైక్లింగ్‌లో కశ్మీర్ యువకుడి గిన్నిస్ రికార్డ్
దిశ, ఫీచర్స్ : కశ్మీర్ నుంచి కన్యాకుమారి(కె టు కె) వరకు ఇప్పటికే చాలామంది సైకిల్ యాత్రలు చేపట్టారు. కానీ కొందరు మాత్రమే ఈ యాత్రలో తమ పేరిట రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటారు. ఈ క్రమంలో కశ్మీర్‌కు చెందిన ప్రొఫెషనల్ సైక్లిస్ట్ ఆదిల్ తెలి.. ‘కె టు కె’ ప్రయాణాన్ని కేవలం 8 రోజుల 1 గంట 37 నిమిషాల్లో పూర్తి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాడు.
2014లో సైక్లింగ్ జర్నీని ప్రారంభించిన ఆదిల్.. కశ్మీర్‌కు చెందిన ఉత్తమ సైక్లిస్టులలో ఒకరిగా నిలవడంతో పాటు దేశంలోనూ బెస్ట్ సైక్లిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మేరకు కశ్మీర్‌తో పాటు కశ్మీర్ యూనివర్సిటీ తరఫున నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్‌లో పతకాలు సాధించాడు. 2019లో శ్రీనగర్ నుంచి లేహ్ వరకు 440కి.మీ దూరం కేవలం 26గంటల 30 నిమిషాల్లో సైక్లింగ్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆదిల్ 2021 మార్చి 22న ఉదయం 7 గంటలకు శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద ఉన్న క్లాక్ టవర్ నుంచి కన్యాకుమారి వరకు తన ప్రయాణాన్ని ప్రారంభించగా, 3600 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఏప్రిల్ 30తో పూర్తి చేశాడు. 17 ఏళ్ల ఓం మహాజన్ 8 రోజుల 7 గంటల 38 నిమిషాల సమయంలో ఈ ఘనత సాధించగా, ఆదిల్ తాజాగా ఆ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ సందర్భంగా ఆదిల్ స్పందిస్తూ.. ‘గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా స్పాన్సర్లతో పాటు ప్రోత్సహించిన వారికి, సిబ్బందికి, కశ్మీర్ ప్రజలకు నా కృతజ్ఞతలు. వారి మద్దతు, శుభాకాంక్షల కారణంగానే ఈ రోజు నేను గిన్నిస్ ప్రపంచ రికార్డ్ హోల్డర్ అయ్యాను’ అని చెప్పుకొచ్చాడు.