గూగుల్ కీలక పదవిలో మరో భారత సంతతి వ్యక్తి!

by Harish |
గూగుల్ కీలక పదవిలో మరో భారత సంతతి వ్యక్తి!
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్‌లో ఇప్పటికే సీఈవో బాధ్యతల్లో భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ఉండగా, మరో కీలక బాధ్యతల్లో భారత సంతతి చెందిన వ్యక్తి ప్రభాకర్ రాఘవన్ నియమితులయ్యారు. గూగుల్ సెర్చ్ హెడ్‌గా ప్రభాకర్ బెన్‌గోమ్ స్థానంలో పదవిని చేపట్టనున్నారు. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ చేసిన ప్రభాకర్ బెర్క్‌లీ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ అందుకున్నారు. 2012లో ప్రభాకర్ గూగుల్ సంస్థలో చేరారు. 2018లో గూగుల్ అడ్వర్‌టైజ్‌మెంట్, కామర్స్ బిజినెస్ హెడ్‌గా ఎదిగారు. ప్రభాకర్ ఈ పదవికి ముందు గూగుల్ యాప్స్, గూగుల్ క్లౌడ్ సేవలకు వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. ఐబీఎం, యాహూ లాంటి కంపెనీల్లో పలు హోదాలను నిర్వహించారు. గూగుల్, జీమెయిల్ డ్రైవ్ నెలకు వంద కోట్ల యాక్టివ్ యూజర్లను అధిగమించడానికి ప్రభాకర్ కీలక పాత్రను నిర్వహించారు. ప్రభాకర్ నియామకంపై స్పందించిన సుందర్ పిచాయ్.. ఆల్గారిథమ్, ర్యాంకింగ్‌ల విషయంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రభాకర్, గూగుల్ కంటే ముందు గూగుల్ సెర్చ్‌లో పనిచేశారని, ఆయన అనుభవం ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed