రాష్ట్రానికి ఐఏపీ రూ.14లక్షల విలువైన వైద్యసాయం

by Ramesh Goud |   ( Updated:2020-04-12 01:18:17.0  )
రాష్ట్రానికి ఐఏపీ రూ.14లక్షల విలువైన వైద్యసాయం
X

హైదరాబాద్: కరోనాపై పోరులో భాగంగా ‘ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్’ (ఐఏపీ) ట్విన్ సిటీస్ బ్రాంచ్ రాష్ట్రానికి రూ.14లక్షల విలువైన వైద్యపరికరాలను విరాళంగా ప్రకటించింది. వీటిలో సగం పరికరాలు గాంధీ ఆస్పత్రికి, మిగతా సగం నిలోఫర్‌కు కేటాయించింది. వైద్యపరికరాల్లో ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు, ఏరో మిషన్లు ఉన్నాయి. ఈ మేరకు ఐఏపీ స్థానిక ప్రతినిధులు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ను హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ భవన్‌లో శుక్రవారం కలిశారు. కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు. కరోనాపై పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఐఏపీ ట్విన్ సిటీస్ బ్రాంచ్ అధ్యక్షులు సి.ఎన్ రెడ్డి, కార్యదర్శి భాస్కర్, ట్రెజరర్ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, అజయ్‌లు ఉన్నారు.

Tags: iap, indian academy of pediatrics, medical equipment donations, etela rajender, brkr bhavan, iap twin cities branch, cn reddy

Advertisement

Next Story