- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో 2021 ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటన పూర్తి షెడ్యూల్‌ను గురువారం బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా విడుదల చేశాడు. కరోనా మహమ్మారి అనంతరం ఇండియాలో జరుగుతున్న తొలి క్రికెట్ సిరీస్ ఇదే. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో బీసీసీఐ పర్యటనను ఖరారు చేసింది. ఇటీవల అహ్మదాబాద్‌లో నిర్మించిన మోతెరా స్టేడియంలో తొలి సారిగా అంతర్జాతీయ మ్యాచ్ జరుగనున్నది. ఇక్కడ పింక్ బాల్ టెస్ట్ (డే/నైట్) మ్యాచ్ నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మొతెరా స్టేడియంలో లక్షా 10 వేల మంది కూర్చునే అవకాశం ఉన్నది. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం మూడు వేదికల్లోనే మొత్తం పర్యటన జరుగనున్నది. 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేలు ఈ పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు ఆడనున్నది. ఫిబ్రవరి 1న మొదలయ్యే పర్యటన మార్చి 28తో ముగియనున్నది. పర్యటన పూర్తి వివరాలు
టెస్ట్ సిరీస్
తొలి టెస్టు – ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు – చెన్నై
రెండో టెస్టు – ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు – చెన్నై
మూడో టెస్టు – ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు – అహ్మదాబాద్ (డే/నైట్)
నాలుగో టెస్టు – మార్చి 4 నుంచి 8 మార్చి వరకు – అహ్మదాబాద్
టీ20 సిరీస్
తొలి టీ20 – మార్చి 12 – అహ్మదాబాద్
రెండో టీ20 – మార్చి 14 – అహ్మదాబాద్
మూడో టీ20 – మార్చి 16 – అహ్మదాబాద్
నాలుగో టీ20 – మార్చి 18 – అహ్మదాబాద్
ఐదో టీ20 – మార్చి 20 – అహ్మదాబాద్
వన్డే సిరీస్
తొలి వన్డే – 23 మార్చి – పూణే
రెండో వన్డే – 26 మార్చి – పూణే
మూడో వన్డే – 28 మార్చి – పూణే