- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాప్-10 స్టాక్ మార్కెట్ జాబితా నుంచి ఇండియా పతనం!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ఇప్పటికే అన్ని రకాల నష్టాలను చూడగలిగాం. తాజాగా భారతీయ స్టాక్ మార్కెట్ సైతం నష్టపోయింది. టాప్ 10 జాబితా నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్ కిందకు పడిపోయింది. కొవిడ్-19 దెబ్బకు దేశంలో లాక్‌డౌన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఆర్థికపరమైన నష్టాల వల్ల ఈక్విటీ మార్కెట్ పతనాన్ని చూడక తప్పలేదు. కీలకమైన సూచీలు దిగజారడంతో లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ఈ నష్టాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ టాప్ 10 జాబితా, 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ మూలధనం నుంచి పడిపోయింది. దీనికి తోడు డాలరుతో రూపాయి మారకం విలువ కూడా కనిష్టానికి చేరుకుంది.
అలా కోల్పోయాం..
బ్లూమ్‌బర్గ్ గణాంకాల ప్రకారం…ఈక్విటీ మార్కెట్ల మొత్తం మార్కెట్ మూలధనం..ఏడాది ప్రారంభం డాలర్ పరంగా 27.30 శాతం తగ్గింది. 1.57 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో 11వ స్థానంలోకి చేరింది. గతేడాది జనవరిలో 2.08 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ఇండియా ఏడవ స్థానంలో ఉండేది. అయితే, ఏడాది జనవరిలో 2.16 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో 10వ స్థానానికి చేరుకుంది. ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 10వ స్థానం కూడా కోల్పోయింది. మార్చి 23న బెంచ్‌మార్క్ సూచీలు అతిపెద్ద ఒకరోజు క్షీణతను నమోదు చేశాక ఇండియా స్టాక్ మార్కెట్ టాప్ 10 జాబితాను పడిపోగా, ప్రస్తుత ఇండియా మార్కెట్ క్యాప్ డాలర్ పరంగా 1.31 ట్రిలియన్లు కాగా, రూపాయి పరంగా రూ. 101.87 లక్షల కోట్లు. అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ 21.74 శాతం క్షీణించి రూ. 155.54 లక్షల కోట్ల నుంచి రూ. 121.73 లక్షల కోట్లకు చేరింది.
ఎఫ్‌పీఐలు పోవడంతో…
విశ్లేషకుల ప్రకారం… ఇండియాలో రికార్డు స్థాయిలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇండియా బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఈ ఏడాది ఇప్పటివరకూ 29.10 శాతం కోల్పోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే 24 శాతం తగ్గడంతో మొత్తం మార్కెట్ క్యాప్ అత్యంత నష్టాన్ని కోల్పోవలసివచ్చింది. ఇండియా మార్కెట్ క్యాప్ 2019లో సుమారు 12 శాతం పెరిగింది. ఇది మొత్తం అంతర్జాతీయ మార్కెట్ క్యాప్‌లో ఇండియా వాటా 2.18 శాతం ఉండగా, 2019 ఏడాది ప్రారంభంలో 2.97 శాతంగా ఉండేది. 2020లో మొత్తం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు 17.15 శాతం క్షీణించాయి.
30 శాతం కోల్పోయిన యూకే…
కొవిడ్-19కు కేంద్రంగా ఉన్న చైనా 2020లో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.36 శాతం అంటే 7.24 ట్రిలియన్ డాలర్లను నష్టపోయింది. ఇక, అమెరికా 29.34 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో మొదటి స్థానాన్ని కాపాడుకుంది. యూకే 30.09 శాతం నష్టపోయి, 2.44 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ఐదవ స్థానంలో ఉంది.
అదే వేగంతో పుంజుకుంటాం…
ఆసియాలో ఇండియా కరెన్సీ రూపాయి అత్యధికంగా పతనాన్ని చూసింది. వరుసగా రికార్డు స్థాయిలో కనిష్టాలను నమోదు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ వరకూ 6.64 శాతం బలహీనపడింది. ఏప్రిల్ నెలలో రూపాయి రూ. 76.92 కనిష్టానికి చేరింది. ఇదే క్రమంలో డాలరు 4.14 శాతం బలపడటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల వందేళ్ల చరిత్రను గమనిస్తే ఉద్దాన పతనాలు సాధారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి దశాబ్దంలో ఏదో ఒక సంఘటన మార్కెట్లు 35 శాతం నష్టాన్ని చూస్తాయి. నష్టాల వల్ల మార్కెట్లో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింటుంది. ఆందోళనల కారణంగా అమ్మకాలకు సిద్ధమవుతారు. దీంతో ఆర్థిక మాంద్యం, ఉద్యోగ మాంద్యం, వేతనాల్లో కోతలు అనివార్య స్థితిగా మారతాయి. ఇటువంటి సంక్షోభాల్లోనే ఇండియా మార్కెట్లు అభివృద్ధి చెందిన, అమెరికా లాంటి మార్కెట్ల కంటే త్వరగా కోలుకుంటాయి. సగటున 12 నుంచి 14 నెలల్లోగా కోలుకోవడం గమనిస్తాం. ఇండియా మార్కెట్లు ఎంత వేగంగా పతనాన్ని నమోదు చేస్తాయో, అంతే వేగంతో పొంజుకుంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags: india, stock market capitalization, china, Market, mcap, sensex, US market, valuation