భారత్ కు రుణపడి ఉంటాం: తాలిబాన్లు

by Anukaran |   ( Updated:2021-12-13 00:40:03.0  )
భారత్ కు రుణపడి ఉంటాం: తాలిబాన్లు
X

దిశ, వెబ్ డెస్క్: సర్వేజనా సుఖినో భవంతు అనేది మన దేశ నినాదం. శత్రువుకు కూడా సహాయం చేయడంలో భారత్ తర్వాతే ఎవరైనా అని మన దేశం మరోసారి రుజువుచేసింది. మనకు తాలిబాన్ల నుంచి ముప్పు ఉందని అంతర్జాతీయ సంస్థలు ఒక వైపు హెచ్చరిస్తున్నా, వాళ్లకు కష్టం వచ్చిందని భారత్ ముందడుగు వేసింది.

ఆఫ్ఘన్ లో చిన్నపిల్లలకు సరిపడా మందులు లేవని తెలిసిన వెంటనే ప్రత్యేక విమానంలో సరాఫరా చేశారు. 1.6 మెట్రిక్ టన్నుల ఔషదాలను కాబూల్ ఎయిర్ పోర్టుకు చేర్చారు. ఆపద సమయంలో ఆదుకున్న భారత్ కు అన్ని వేళలా రుణపడి ఉంటామని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరు దేశాల సంబంధాలే బలపడాలని ఆశిస్తున్నట్టు తాలిబాన్లు తెలిపారు.

భారత్ లో ఉంటున్న ఆఫ్ఘన్ రాయబారి ఫరీద్ మహమ్మద్ మాట్లాడుతూ.. భారత్ మా పట్ల చూపుతున్న ఔదార్యానికి నిజంగా ఎంతో రుణపడి ఉంటామని, ఆపద సమయంలో సహాయం చేసిన వారినే మహాత్ములు అని అన్నారు.

Advertisement

Next Story