- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెప్టెంబర్‌లో 16,570 కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది దేశంలో 16,570 కొత్త కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. మొత్తం యాక్టివ్ కంపెనీల సంఖ్య 14.14 లక్షలకు పైగా ఉన్నాయి. సెప్టెంబర్ 30 నాటికి దేశంలో మొత్తం 22,32,699 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి. వీటిలో 7,73,070 కంపెనీలు మూసివేయబడ్డాయి. 2,298 సంస్థలు కంపెనీల చట్టం ప్రకారం ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడంలేదు. 6,944 కంపెనీలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. 2020, ఏప్రిల్‌లో కనిష్టంగా 3,209 కంపెనీలు రిజిస్ట్రేషన్లు జరిగాయని, అప్పటి నుంచి నెలవరీ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, గతేడాది సెప్టెంబర్‌లో నమోదైన 16,641 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఈసారి తగ్గాయి. ఇదే సమయంలో అంతకుముందు నెల కంటే ఈ ఏడాది సెప్టెంబర్‌లో 24.68 శాతం పెరిగాయి.