- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రంగంలో అదనంగా 2.5 కోట్ల మందికి ఉపాధి!
దిశ, వెబ్‌డెస్క్: 2030 నాటికి భారత రిటైల్ రంగం 2.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని ఓ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో ప్రధానంగా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మోడల్ రూపంలో ఉద్యోగాలు ఉండనున్నాయి. ఇది మొత్తం రిటైల్ ఉపాధిలో దాదాపు 50 శాతం ఉంటుందని నాస్కామ్ నివేదిక అభిప్రాయపడింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడల్‌లో రానున్న పదేళ్లలో సుమారు రూ. 9 లక్షల కోట్లకు పైగా ఎగుమతులకు, రూ. 59 వేల కోట్ల జీఎస్టీ ఆదాయానికి దోహదపడనున్నట్టు కన్సల్టింగ్ సంస్థ టెక్నోపాక్‌తో కలిసి నాస్కామ్ రూపొందించిన నివేదిక తెలిపింది. రిటైల్ రంగం వల్ల దేశీయ మార్కెట్ పరిమాణం, ఉద్యోగాల కల్పన, ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి.
2030 ఆర్థిక సంవత్సరం నాటికి భారత రిటైల్ మార్కెట్ 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, మారుతున్న డిమాండ్, సరఫరా వ్యవస్థ వృద్ధి వేగాన్ని పెంచే అవకాశం ఉందని నాస్కామ్ పేర్కొంది.’జీడీపీకి రెండంకెల వృద్ధి సహకారంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 3.5 కోట్ల మందికి ఉపాధి కల్పించడం ద్వారా దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధిలో రిటైల్ రంగం కీలకంగా ఉందని’ ఇటీవల నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు. నివేదిక ప్రకారం..భారత్‌లో ఈ-కామర్స్ రంగం 3-4 రెట్లు వృద్ధిని సాధిస్తోంది. ‘ఈ వృద్ధి పెరుగుతున్న ఆర్థిక సహకారం, ఉద్యోగం వృద్ధి, ఎగుమతులకు దారితీస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఈ రంగం వృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని’ నాస్కామ్ అధ్యక్షుడు దేబ్జని ఘోష్ వెల్లడించారు.