- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలర్ టీవీ కొంటున్నారా?.. అయితే ఇది తెలుసుకోండి
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు, చైనా నుంచి నిత్యావసరం కాని ఉత్పత్తులను, వస్తువులను నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కలర్ టీవీల దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఇప్పటివరకు కలర్ టీవీలను ఎలాంటి నియంత్రణలు లేకుండా దిగుమతి చేసుకునే అవకాశం ఉండగా, ఇకమీదట కలర్ టీవీలన్నిటినీ నియంత్రణ పరిధిలోనికి చేరుస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విభాగం(డీజీఎఫ్‌టీ) వెల్లడించింది.
దీంతో భవిష్యత్తులో కలర్ టీవీల ధరలు విపరీతంగా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో 32 సెంటిమీటర్ల నుంచి 105 సెంటీమీటర్ల పరిమాణంలో స్క్రీన్ కలిగిన టీవీలు, 63 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఎల్‌సీడీ టీవీలు ఈ నియంత్రణ పరిధిలోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలు తర్వాత కలర్ టీవీలను దిగుమతి చేసుకోవాలంటే తప్పనిసరిగా కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోన్ని డీజీఎఫ్‌టీ లైసెన్స్ పోందాలి. కాగా, దేశంలో అధికంగా టీవీలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. చైనా తర్వాత స్థానాల్లో వియత్నాం, మలేషియా, హాంకాంగ్, కొరియా దేశాలున్నాయి.