- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో ఒక్కరోజే 2,293 కేసులు
by vinod kumar |
X
న్యూఢిల్లీ : భారత్‌లో ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కొత్తగా 2,293 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. కాగా, రోజు వ్యవధిలోనే 71 మంది ఈ వైరస్ కారణంగా మరణించారని తెలిపింది. దీంతో దేశంలో కరోనా కేసులు 37,336కు చేరాయని, కరోనా మరణాలు 1,218కు పెరిగినట్టు వివరించింది. కాగా, ఈ వైరస్ నుంచి సుమారు 10వేల(9,951) మంది కోలుకున్నారు. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ మార్గాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ రెండుసార్లు పొడిగించింది కూడా. ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడం, ప్రభుత్వ ఖజానా కరిగిపోతుండటంతో ఈ లాక్‌డౌన్ కాలంలోనూ పలుసేవలకు మినహాయింపులనిచ్చింది.
Tags: coronavirus, count, toll, india, infection, daily single, biggest
Advertisement
Next Story